తెలంగాణ

telangana

ETV Bharat / state

'కురుమల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు'

సీఎం కేసీఆర్​ కురుమ కులస్థుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. బేగంబజార్​లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు.

యెగ్గె మల్లేశం

By

Published : Apr 5, 2019, 5:36 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులకు రాష్ట్ర కురుమ సంఘం సంపూర్ణ మద్దతిచ్చిందని అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తెలిపారు. హైదరాబాద్​ బేగంబజార్​లోని సంఘం భవనంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గానికి సముచిత స్థానం కల్పించాలని మల్లేశం కోరారు.

కురుమల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details