తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆబ్కారీశాఖ నజర్​... 2 వేలకు పైగా కేసుల నమోదు - Abkari Department Latest News

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి మద్యం, గుడుంబా విక్రయాలు చేస్తున్న వారి ఆబ్కారీ శాఖ కొరడా ఝళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు వేలకుపైగా కేసులు నమోదు చేసింది. అక్రమంగా మద్యం అమ్ముతున్న రెండు వేల మందిని అరెస్ట్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఆబ్కారీ శాఖ
ఆబ్కారీ శాఖ

By

Published : Apr 23, 2020, 4:06 AM IST

లాక్‌డౌన్‌ నియమాలను పాటించకుండా అనధికారికంగా మద్యం, గుడుంబా విక్రయాలు చేస్తున్న వారిపై అబ్కారీ శాఖ భారీగా కేసులు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా కేసులు నమోదు చేసి... మొత్తం రెండు వేల మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 61మందిపై 34 కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.

అక్రమంగా మద్యం అమ్ముతున్న మరో 656 మందిపై కేసులు నమోదు చేసి... అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఆరు వేల లీటర్లకు పైగా లిక్కర్‌, నాలుగున్నర వేల లీటర్లకు పైగా బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. గుడుంబా తయారు చేసి విక్రయాలు చేస్తున్న వారిపై 1,182 కేసులు నమోదు చేసి... 1,071 మందిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. 5,252 లీటర్ల గుడుంబా, నాటుసారా తయారీకి ఉపయోగించే 81, 885 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు.

ఇవీ చూడండి:24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు

ABOUT THE AUTHOR

...view details