Abhishek Attends ED Inquiry in MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ అధికారులు.. మానిక్‌చంద్ గుట్కా సంస్థకు చెందిన అభిషేక్ ఆవులను విచారిస్తోంది. ఈడీ కార్యాలయంలో అభిషేక్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు, తనకూ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. పైలట్ రోహిత్ రెడ్డితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని తెలిపారు. రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్‌రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని స్పష్టం చేశారు. నందకుమార్ మోసం చేసిన విషయాన్ని ఇది వరకే ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. మాణిక్‌చంద్ లావాదేవీల విషయంలో నోటీసులు జారీ చేశారని వివరించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: ఈడీ విచారణలో అభిషేక్ - రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల ఎర కేసు
Abhishek Attends ED Inquiry in MLAs Poaching Case : ఈడీ కార్యాలయంలో అభిషేక్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు, తనకూ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. పైలట్ రోహిత్ రెడ్డితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని తెలిపారు.
Enforcement Directorate
ఈసీఆర్ నెంబర్ 48/2022కు సంబంధించిన కేసు విచారణకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో వివరించారు. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌తో పాటు వ్యాపార సంస్థలు, అభిషేక్ ఆయన కుటుంబసభ్యల పేర్ల మీద ఉన్న బ్యాంకు ఖాతాలు, స్థిర చరాస్థుల కు సంబంధించిన పత్రాలతో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రోహిత్‌రెడ్డిని కూడా ఈడీ ఇదే కేసు 48/2022 లో విచారిస్తోంది.
ఇవీ చూడండి: