తెలంగాణ

telangana

ETV Bharat / state

రవీంద్రభారతిలో ఘనంగా కలామ్, బాపూ జయంతి ఉత్సవాలు - రవీంద్రభారతిలో అబ్దుల్ కలాం జయంతి

హైదరాబాద్​ రవీంద్రభారతిలో గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, అల్ ఇండియా డిసెబుల్డ్ రైట్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.

రవీంద్రభారతిలో ఘనంగా కలామ్, బాపూ జయంతి ఉత్సవాలు

By

Published : Oct 15, 2019, 6:14 PM IST

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, గాంధీ జయంతి వేడుకలను గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, అల్ ఇండియా డిసెబుల్డ్ రైట్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అబ్దుల్ కలామ్, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలామ్ సేవ పురస్కార్, గాంధీ శాంతి అవార్డులతో దివ్యాంగులను సన్మానించారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు, క్షిపణి పితామహుడు, దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ప్రథమ పౌరుడు కలాం అని సమావేశంలో పాల్గొన్న వక్తలు ఆయనను కొనియాడారు.

రవీంద్రభారతిలో ఘనంగా కలామ్, బాపూ జయంతి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details