తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంలో విచారణ వాయిదా

సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు... విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

By

Published : Feb 16, 2021, 1:45 PM IST

ab-venkateswara-rao-suspension-hearing-in-the-supreme-court
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ జరిపిన జస్టిస్ ఏఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం.. పిటిషన్‌పై సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. వారం రోజుల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ధర్మాసనం.

సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గతంలో విధుల్లో నుంచి తొలగించింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసింది.

ఇదీ చదవండి:పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details