సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో ఓ యువతికి టోకరా వేశాడు ఓ వ్యక్తి. సినిమాలో ఒక పాటకు రూ. 10 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అంటూ గీతాలయా స్టూడియో పేరిట సంస్థ నిర్వహకుడు గీతా వెంకట ప్రసాద్ కొద్దిరోజుల క్రితం పేపర్లో ప్రకటనను ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి 10 మంది యువతులు ఆడిషన్స్‌కి వెళ్లారు. లాక్డౌన్ ఉన్నందున ఎటువంటి అవకాశాలు ఇప్పించకపోవడంతో 9 మంది యువతులు వెనుదిరిగారు. కానీ ఓ యువతికి మాయమాటలు చెప్పి తాను తీస్తున్న చిత్రానికి బడ్జెట్ సరిపోలేదని కొంత డబ్బులు సహాయం చేయమని గీతాప్రసాద్ కోరాడు. ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షలను రెండు దఫాలుగా వసూలు చేశాడు. సినిమా షూటింగ్ జరగకపోవడంతో తన నగదు ఇవ్వాలని యువతి గీతా వెంకట ప్రసాద్‌ను నిలదీసింది. హోటల్‌కు వస్తే డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి రప్పించి అప్పటికే అక్కడ మాటువేసుకుని ఉన్న గీతా వెంకట ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు తనను చంపేస్తామని బెదిరించారని బాధితురాలు పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని గ్రహించి వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం అమ్మాయిని పోలీసులు పిలిచి వాస్తవాలను తెలుసుకున్నారు. గీతా ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పశ్చిమ ఏసీపీ స్వరూపారాణి తెలిపారు.
ఐటమ్ సాంగ్‌లో ఛాన్స్ అన్నాడు.... ఐదు లక్షలు నొక్కేశాడు... - ఆంధ్రప్రదేశ్ వార్తలు
సినిమాల్లో ఐటమ్ సాంగ్ పేరిట యువతికి టోకరా వేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కలకలం రేపింది. గీతాలయా స్టూడియో పేరిట కొద్దిరోజుల క్రితం పేపర్లో ప్రకటన ఇచ్చిన సంస్థ నిర్వహకుడు గీతా ప్రసాద్ ఓ యువతిని మోసం చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఐటమ్ సాంగ్‌లో ఛాన్స్ అన్నాడు.... ఐదు లక్షలు నొక్కేశాడు...