వేతనాలు పెంచాలని కోరుతూ ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ ఎదుట ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ప్లకార్డులు, నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. కరోనా విపత్కర సమయంలోనూ తమకు జీతాలు పెంచకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించారు.
వేతనాలు పెంచుతామని..
ఏపీలో ఆశావర్కర్లు పది వేలు జీతం తీసుకుంటున్నప్పటికీ.. తెలంగాణలో కేవలం 7,500 మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించకుండా వేతనాలు పెంచకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచుతామని పలుమార్లు చెప్పినా ఇప్పటికీ అది జరగలేదన్నారు. ఉద్యోగంలో ఇటీవల చేరిన వారికి గత ఐదు నెలలుగా వేతనం చెల్లించలేదని పేర్కొన్నారు.
వేతనాలు పెంచాలని అధికారుల దృష్టికి తీసుకుళ్తే ఇష్టం ఉంటే పని చేయండి లేదంటే మానేయండి అనేలా వారు వ్యవహరిస్తున్నారు. గత ఏడాదిలో చేసిన సర్వే డబ్బులు ఇప్పటివరకు రాలేదు. పల్స్‌పోలియో కార్యక్రమానికి అంతకు ముందు డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు.