రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం ఎంతోమంది వృద్ధులు, వితంతువులు(Aasara pension latest news) ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారికి, ఇంటిపెద్దను కోల్పోయి ఆసరా కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా రెండున్నరేళ్లుగా పింఛను మంజూరు కావడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛను బ్యాంకు ఖాతాల్లోకి రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గించాక స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలుకాలేదు. వృద్ధాప్య పింఛన్లకు గతంలో అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది. వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చుతోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు వితంతువులు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు(Aasara pension scheme news) చేసుకుంటున్నారు. వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే రెండున్నరేళ్లుగా దరఖాస్తులు తీసుకుని, పింఛను పొందేందుకు అర్హత కల్పించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు.
2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లలో పింఛనుకు అర్హత పొందిన లబ్ధిదారులు దాదాపు లక్ష మందికిపైగా ఉంటారని అంచనా. నెలకు రూ. 2,016 వస్తే అనారోగ్య అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా(Aasara pension in telangana) ఆగస్టులో తొలుత 7.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో మరోసారి అవకాశమివ్వడంతో మరో 40 వేల వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని ఎప్పటి నుంచి పరిష్కరించాలో గ్రామీణాభివృద్ధిశాఖ నిబంధనలు, గడువును వెల్లడించలేదు. అర్హత వయసు తగ్గించాక కొత్తగా వచ్చిన 7.8 లక్షల దరఖాస్తుల్లో.. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఉన్నారు.
నెలకు రూ. 180 కోట్లు..