జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తోన్న వినియోగదారులు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కోసం కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు గడువును పొడిగించారు. ఆగస్టు 15 వరకు గడువును పెంచుతున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాల మేరకు జలమండలి నగరంలోని వినియోగదారులకు ఆగస్టు 15 వరకు తాగునీరు, సీవరేజీ బిల్లులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం నీటి మీటర్లు కలిగిన డొమెస్టిక్ వినియోగదారులు ఆగస్టు 15 వరకు ఈ పథకం పొందేందుకు తమ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.
ఈ పథకానికి అర్హత పొందడానికి వినియోగదారులు తమ క్యాన్ నెంబర్కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు తమ కనెక్షన్లకు మీటర్ బిగించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.