Making Clay Miniature Dolls: ఈ యువతికి చిన్ననాటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే క్లే మినియేచర్ బొమ్మలు తయారు చేయటం నేర్చుకుంది. అలా మంచి చిత్రాలు, అందమైన కళాకృతులతో ప్రతిభ, నైపుణ్యాలు ప్రదర్శిస్తుంది. ఈ మధ్యే.. వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతుంది ఈ యువతి. హైదరాబాద్‌కు చెందిన ఈ యువతి పేరు లక్ష్మీ ప్రసన్న. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రసన్నచిన్నప్పటి నుంచి చదువుతో పాటు.. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ నైపుణ్యాల్లో ప్రతిభ కనబరిచేది.
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్‌ల్లో బీటెక్ చేసిన ఈ యువతి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తోంది. అయినా తీరిక దోరికితే చాలు అందమైన కళాకృతులు తయారు చేస్తూ తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుంది ఈ యువతి. మంచి వేతనంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడి తాను ఇష్టపడ్డ వ్యక్తిని వివాహాం చేసుకుంది ప్రసన్న. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలోని ప్రతి జ్ఞాపకం ఓ తీపి గుర్తుగా మలుచుకోవాలనుకుంది.
మినియేచర్ రంగంలో రాణించాలనే కోరిక:అలా తనకు ఉన్న నైపుణ్యంతో మినియేచర్ బొమ్మలు తయారు చేసింది. వాటిని పుట్టబోయే బేబికి మంచి గిఫ్ట్స్‌గా ఇవ్వలనుకున్నట్లు చెబుతుంది ప్రసన్న. ప్రసన్నలో ఉన్న భిన్నమైన ప్రతిభ, నైపుణ్యాలు చూసి బంధువులు, మిత్రులు ప్రశంసించే వారు. దాంతో మినియేచర్ రంగంలో రాణించాలనే కోరిక మరింత బలపడింది. అలా ఎవరైనా అడిగితే చిన్న చిన్న బొమ్మలు చేసి ఇచ్చేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతున్న అని అంటుంది ఈ యువతి.
హాబీస్‌ను గుర్తించాలి:ఓ దశలో ఉన్నప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది పడింది ప్రసన్న. ఈ సమయంలో తనకు నచ్చిన పని చేయాలనిపించి క్లే మినియేచర్ బొమ్మలు తయారు చేయటం ప్రారంభించింది. హాబీస్‌ను గుర్తించి.. వాటిని నిలుపుకుంటూ రావాలని.. దాని వల్ల మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారని చెబుతుంది ప్రసన్న. సాధారణంగా పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం.