Youngman Cheats Junior Artist in the name of LOVE: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట.. ఎక్కడో ఒక దగ్గర బాలికలు లేదా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతికి ఓ చర్చిలో 2021లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన రోహిత్ఖాన్ పరిచయమయ్యాడు. ఆ యువతి 2021 సెప్టెంబరులో ఉద్యోగం కోసమని హైదరాబాద్‌కి వచ్చింది. ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ బోరబండలో నివాసం ఉంటోంది. తాను నగరానికి వచ్చిన విషయం తెలుసుకుని రోహిత్ఖాన్ హైదరాబాద్ వచ్చాడు. ఏదో విధంగా ఆ యువతి ఫోన్ నంబరు సంపాదించిన రోహిత్ తరచూ ఆమెకు ఫోన్ చేయసాగాడు.