Cat Theft In Vanasthalipuram: నగదు, బంగారం, వాహనాలు ఎత్తికెళ్లిన దొంగలు చూశాం కానీ వీడు ఎవడోగాని పెంపుడు జంతువులు మీద చూపు పడినట్లుంది. దర్జాగా బైక్పై వచ్చి ఓ ఇంటి ముందు చక్కగా ఆడుకుంటున్న పిల్లిని అలా లటుక్కున పట్టుకొని చంకాలో పెట్టుకొని వెళ్లిపోయాడు. తన పిల్లి కనిపించకపోవడంతో కలవరానికి గురైన యువకుడు చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఎంతో ఇష్టంగా, ప్రాణానికి ప్రాణంగా పెంచకుంటున్నా తన పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడని పోలీసులు ముందు తన బాధను వెల్లబుచ్చుకున్నాడు.
పిల్లే కదా లైట్ తీసుకోరాదు అని స్థానికులు చెప్పగా దానికి యజమాని మహమూద్ వారిపై మండిపడి దాని ప్రత్యేకతలు వివరించాడు. అది అరుదైన హౌ మనీ(Khow Manee) రకానికి చెందిన పిల్లి అని ఒక కన్ను బ్లూ.. మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం ఈ పిల్లి యొక్క ప్రత్యేకతని చెప్పాడు. 18 నెలల ఈ పెంపుడు పిల్లి చాలా అరుదైనదని.. సుమారు రూ. 50 వేల ఖరీదు ఉంటుందని వెల్లడించాడు.