తెలంగాణ

telangana

ETV Bharat / state

CM JAGAN FAN: ఏపీ సీఎం జగన్​ను కలవాలని తెలంగాణ నుంచి వెళ్లాడు.. కానీ! - ap latest news

ఏపీ సీఎం జగన్​ను కలిసేందుకు పాదయాత్రగా వెళ్లిన ఓ యువకుడ్ని ఆ రాష్ట్ర పోలీసులు తాడేపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్​పై ఉన్న అభిమానంతో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన యువకుడు పాదయాత్రగా వెళ్లి.. జగన్​ అపాయింట్​మెంట్ కావాలంటూ తనిఖీ కేంద్రం వద్ద హడావుడి చేశాడు.

AP CM JAGAN FAN
ఏపీ సీఎం జగన్​ అభిమాని

By

Published : Jul 14, 2021, 7:34 PM IST

CM JAGAN FAN: ఏపీ సీఎం జగన్​ను కలవాలని తెలంగాణ నుంచి వెళ్లాడు.. కానీ!
AP CM JAGAN FAN: జగన్​ కోసం పాదయాత్రగా వెళ్లిన అభిమాని.. అదీ తెలంగాణ నుంచి

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​పై ఉన్న అభిమానంతో తెలంగాణ నుంచి పాదయాత్రగా వెళ్లిన యువకుడిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 8న వైఎస్ జయంతి సందర్భంగా సంగారెడ్డికి చెందిన కిశోర్.. జగన్​ను కలిసేందుకు పాదయాత్ర మొదలుపెట్టి ఇవాళ తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద ఉన్న తనిఖీ కేంద్రానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కావాలంటూ.. తనిఖీ కేంద్రం వద్ద ప్లెక్సీలతో హడావుడి చేశారు. దీంతో పోలీసులు కిశోర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈరోజు లేదా రేపు ఉదయం సీఎంను కలిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:BJP: హుజూరాబాద్​లో భాజపా విజయం ఖాయం.. అందుకే తెరాసకు భయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details