తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా నేత మురళీధర్​రావుపై హైకోర్టులో పిటిషన్​ - భాజపా నేత మురళీధర్​రావు

భాజపా నేత మురళీధర్​రావుపై తాను వేసిన కేసులో దర్యాప్తు జరగడం లేదని ఆరోపిస్తూ ప్రవర్ణారెడ్డి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు నామినేటెడ్​ పదవి ఇప్పిస్తామని రూ. 3 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ప్రవర్ణారెడ్డి గతంలో సరూర్​నగర్​ పీఎస్​లో కేసు నమోదు చేశారు. విచారణ చేసిన హైకోర్టు కేసును 4 వారాలకు వాయిదా వేసింది.

భాజపా నేత మురళీధర్​రావు

By

Published : Jul 15, 2019, 12:53 PM IST

Updated : Jul 15, 2019, 1:11 PM IST

భాజపా నేత మురళీధర్​రావుపై హైకోర్టులో పిటిషన్​

భాజపా జాతీయ నేత మురళీధర్​రావు తనను మోసం చేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ వేగంగా జరగడం లేదని ప్రవర్ణారెడ్డి అనే మహిళ మళ్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. సరూర్​నగర్​ పోలీస్​స్టేషన్​లో మార్చిలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరగడం లేదని ఆరోపించారు. నామినేటెడ్​ పోస్టు ఇప్పిస్తామని మురళీధర్​రావు, మరికొందరు కలిసి రూ. 3 కోట్లు తీసుకుని మోసం చేశారని ప్రవర్ణారెడ్డి తెలిపారు. దీనిపై 4 వారాల్లో ఛార్జిషీట్​ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Jul 15, 2019, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details