పాతబస్తీకి చెందిన ఓ మహిళ ఆర్టీసీ బస్సులో శంషాబాద్ నుంచి ప్రయాణించి పురానాపూల్లో దిగింది. తన బ్యాగును బస్సులో మరిచిపోయినట్లు గమనించిన ఆమె అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు ఇనాయతుల్లా ఖాన్కు విషయం వివరించింది. వెంటనే అతను తన వాహనంలో ఆమెను తీసుకుని బస్సును వెంబడించి అఫ్జల్గంజ్ వద్ద బస్సును అందుకున్నారు. బస్సులో బ్యాగును తీసుకుని బాధితురాలికి అందజేశాడు. బ్యాగులో బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు, ఔషధాలు ఉన్నాయి. తన బ్యాగు తనకు చేరడంపై బాధితురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఇనాయతుల్లా ఖాన్ చూపిన చొరవపై పలువురు ప్రశంసించారు.
ట్రాఫిక్ పోలీసు చొరవ.. నిమిషాల్లోనే పోయిన నగలు లభ్యం - హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్ పోలీసు చొరవతో ఓ మహిళ పోగొట్టుకున్న బంగారు నగల సంచిని తిరిగి పొందగలిగింది. బస్సులో బ్యాగ్ మార్చిపోయిన విషయం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్కు చెప్పగా.. ఆయన బస్సును వెంబడించి నగలసంచి తిరిగి ఆమెకు అందజేశారు.
ట్రాఫిక్ పోలీసులు