ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే చాలు. వారిని చక్కగా పెంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. కొన్ని సార్లు వారిని పెంచేందుకే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటింది ఓ మహిళ 108 వాహనంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీనిలో ఏముంది చెప్పుకోవడానికి అనుకుంటున్నారా? కచ్చితంగా విశేషమే ఉంది. ఈ కాన్పు ఆమెకు ఎనిమిదవది.
ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన మస్తానమ్మ అనే గర్భిణికి వయస్సు 45 ఏళ్లు. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. నాయుడుపేటకు చెందిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ అయ్యాయి.