టిడ్కో గృహాలు అర్హులైన వారికి ఇవ్వలేదని ఓ మహిళ ఏపీ ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు వద్ద విచారం వ్యక్తం చేసింది. రామతీర్థం పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు వాహనాన్ని.. విజయనగరం జిల్లా రామతీర్థం కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు.
ఇల్లు కావాలంటే.. భార్యా భర్తల్లో ఒకరే బతికుండాలట సర్! - chandra babu on tidco houses
ఏపీలో గత ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో గృహాలు ఇవ్వడం లేదని ఓ మహిళ తెదేపా అధినేత చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. రామతీర్థం పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు వద్ద ఓ మహిళ గోడు చెప్పుకుంది.

'భర్త ఉంటే భార్య ఉండకూడదు.. భార్య ఉంటే భర్త ఉండకూడదంట సార్..?'
రకరకాల కారణాలతో టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని మహిళ చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో భార్య ఉంటే భర్త ఉండకూడదని.. భర్త ఉంటే భార్య ఉండకూడదన్న నిబంధనలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. స్పందించిన చంద్రబాబు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షనేత అంటేనే లెక్కలేదని.. సామాన్య ప్రజలంటే ఏమి గౌరవం ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి:రామతీర్థం: చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు