తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ సార్​ను కలవాలంటూ.. అసెంబ్లీ ముందు మహిళ హల్​చల్ - అసెంబ్లీ వద్ద హల్​చల్ చేసిన మహిళ

A Woman Came to Assembly And Created a Ruckus: ఓ మహిళ అసెంబ్లీ వద్దకు వచ్చి హల్​చల్ చేసింది. భారతమాత వేషధారణలో వచ్చి సీఎం కేసీఆర్​ని కలిసేందుకే వచ్చానంటూ... అసెంబ్లీ ముందు హడావిడి చేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

A Woman Came to Assembly And Created a Ruckus
A Woman Came to Assembly And Created a Ruckus

By

Published : Feb 3, 2023, 1:36 PM IST

A Woman Came to Assembly And Created a Ruckus: ఓ మహిళ అసెంబ్లీ వద్దకు వచ్చి హల్​చల్ చేసింది. భారత మాత వేషధారణలో అసెంబ్లీ వద్దకు వచ్చిన ఆమె... ముఖ్యమంత్రి కేసీఆర్​ని కలిసేందుకు వచ్చానంటూ హల్ చల్ సృష్టించింది. ఆమె అసెంబ్లీ వద్దకు రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. తన మీద అత్యాచారం చేసిన వ్యక్తిపై వికారాబాద్ మోమిన్ పేట్ సీఐ కేసు తీసుకోవడం లేదని.. అందుకే సీఎం కేసీఆర్​ను కలవడానికి అసెంబ్లీకు వచ్చినట్లు పోలీసులకు తెలిపింది. ఎలాగైనా కేసీఆర్ సార్​ను కలవాలంటూ.. నానా రచ్చ చేసింది. ఇక అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ దగ్గరకు వచ్చిన మహిళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details