Auto collided with a parked lorry: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద 13 మందితో వెళ్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
లారీని ఢీకొన్న ట్రాలీ ఆటో.. నలుగురు మృతి
09:33 November 16
లారీని ఢీకొన్న ట్రాలీ ఆటో.. నలుగురు మృతి
గండేపల్లి ఎస్సై గణేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాలకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామశివారులో వీరందరూ ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఆగిఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల్లజర్లకు చెందిన టాటా మ్యాజిక్ డ్రైవర్ కొండా (38) అక్కడికక్కడే మృతి చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నారాయణరానికి చెందిన ప్రసాద్ (48), ఉండ్రాజరానికి చెందిన మహేశ్ (28) నల్లజర్లకు చెందిన మంగ (36) ఉన్నారు. వరంగల్‌కు చెందిన పార్వతి (35), గుణంపల్లికు చెందిన మణికంఠ (25) పరిస్థితి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు.
ఇనీ చూడండి:
TAGGED:
లారీని ఢీకొన్న ట్రాలీ ఆటో