నగరంలో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా వీఎస్టీ నుంచి రాంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు అడ్డంగా నేలకొరిగింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. స్థానికంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు - Fallen tree in Mushirabad constituency
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వీఎస్టీ నుంచి రాంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు కూలి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో వీఎస్టీ నుంచి రాంనగర్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
![రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు A tree fallen on the musheerabad road traffic stopped](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8752700-552-8752700-1599738505928.jpg)
రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు
రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు
ఈ నేపథ్యంలో వీఎస్టీ నుంచి రాంనగర్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు వర్షం నీరు రోడ్డుపై నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కూలిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమాచారం జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ పోలీసులకు తెలుపగా.. ఆ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు.
ఇదీ చూడండి :భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్‌కు అంతరాయం