తెలంగాణ

telangana

ETV Bharat / state

రోలింగ్ స్కేటింగ్​లో సత్తా చాటిన తెలుగు బాలుడు - 58వ జాతీయ క్రీడల వార్తలు

ఇటీవల పంజాబ్​లో జరిగిన జాతీయ క్రీడల్లో తెలుగు బాలుడు సత్తా చాటాడు. కూకట్​పల్లిలోని తులసివనం అపార్ట్​మెంట్​ చెందిన నిఖిల్ రోలింగ్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా అపార్ట్​మెంట్ వాసులు అతనికి ఘనస్వాగతం పలికారు.

hyderabad boy won a gold medal in rolling skating
58వ జాతీయ క్రీడల వార్తలు

By

Published : Apr 6, 2021, 1:25 PM IST

Updated : Apr 6, 2021, 1:46 PM IST

పంజాబ్​లో జరిగిన 58వ జాతీయ రోలింగ్ స్కేటింగ్ ఛాంపియన్​షిప్​లో కూకట్​పల్లిలోని తులసివనం గృహ సముదాయానికి చెందిన అల్లూరి నిఖిల్(9) జయకేతనం ఎగురవేశాడు. జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా ఇంటికి చేరుకున్న బాలుడికి.. అతనితో పాటు క్రీడల్లో పాల్గొన్న శ్రేష్ఠ అనే బాలికకు అపార్ట్​మెంట్​ వాసులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరించి అభినందిచారు.

ఈ నెల 1 నుంచి పంజాబ్​లో జరిగిన 58వ జాతీయ రోలింగ్ స్కేటింగ్ ఛాంపియన్​షిప్​ అండర్ 9 పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న నిఖిల్ బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అపార్ట్​మెంట్ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకారం అందిస్తే నిఖిల్​ రాష్ట్రానికి మంచి పేరు తీసుకోస్తాడని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:పుస్తకాలు కొనండి.. ఫీజులూ కట్టండి

Last Updated : Apr 6, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details