హైదరాబాద్ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థి హర్షవర్ధన్‌కు అరుదైన అవకాశం లభించింది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. బిహార్‌కు చెందిన దీపక్ కుమార్.. హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు హర్షవర్ధన్.. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా.. అందులో ప్రయాణించేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు.. నవోదయ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వందేభారత్ రైలులో.. రైల్వే శాఖ మంత్రితో కలిసి ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. దీనికి హర్షవర్ధన్ ఎంపికయ్యాడు.
ఈ క్రమంలోనే హర్షవర్ధన్.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వరంగల్ వరకు అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ప్రయాణించాడు. ఈ అవకాశం తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు, పాఠశాల యజమాన్యానికి హర్షవర్ధన్ కృతజ్ఞతలు తెలిపాడు.