పోల్చొద్దు:
మీ చిన్నారిని మిగతా తోబుట్టువులతో పోల్చొద్ధు ఇది వారిలో ఆత్మన్యూనతనూ, ఎదుటివారిపై ద్వేషాన్ని పెంచుతుంది. అలాగే ఒకరి ముందు మరొకరిని తిట్టడం, విమర్శించడం అస్సలు చేయొద్ధు ఇవన్నీ ఆ చిన్ని మనసులపై ప్రతికూల ముద్ర వేసే అవకాశం ఎక్కువ. ఏదైనా ఓ సందర్భంలో ఎవరిని ముద్దు చేసినా...ఇద్దరూ రెండు కళ్లనే విషయాన్ని వారికి చెప్పగలగాలి. అప్పుడే వారు కలిసి ఉంటారు.
తప్పులు తెలుసుకునేలా...
పిల్లలు గొడవపడటం సహజం. మీ అవసరం ఉంటే తప్ప వారి మధ్యలో జోక్యం చేసుకోవద్ధు తప్పొప్పులు తెలుసుకుని కాసేపటి తరువాత వారే కలసిపోతారు. అలాకాకుండా మీరే ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘నువ్వే చేసుంటావ్’ అని ముందే వారిని నిందితుల్ని చేయకండి. తప్పు ఎవరు చేసినా...సరే వారితో క్షమాపణ చెప్పించండి. ఏదైనా పూర్తిగా నిజం నిర్థారించుకున్న తరువాతే మీరు మాట్లాడాలి.
పంచుకోనివ్వండి...
పిల్లలకు నాదీ, నీది అనే అలవాటు చేయొద్ధు ఏదైనా సరే, పంచుకోవడం సర్దుకుపోవడం అలవాటు చేస్తే వారి మధ్య ప్రేమబంధం సాగుతుంది.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా