తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

Buying TRS MLAs Issue Update: ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఆరుగురు పోలీసు అధికారులున్నారు. ప్రస్తుతం దర్యాప్తు అంతా మెయినాబాద్ పోలీసుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం చేతుల్లోకి వెళ్లనుంది.

buying TRS MLAs issue
buying TRS MLAs issue

By

Published : Nov 9, 2022, 6:24 PM IST

Updated : Nov 9, 2022, 7:17 PM IST

Buying TRS MLAs Issue Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఆరుగురు పోలీసు అధికారులున్నారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వేంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మెయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి సభ్యులుగా ఉన్నారు.

సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎన్నో ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణతో ముడిపడి ఉన్న దర్యాప్తును సిట్ అధికారులు ముందుకు తీసుకెళ్తారని హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ముగ్గురు నిందితులను మెయినాబాద్ పోలీసులు 28వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారు. భాజపా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తుపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రస్తుతం దర్యాప్తు అంతా మెయినాబాద్ పోలీసుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం చేతుల్లోకి వెళ్లనుంది. నిందితులను సైతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో ప్రశ్నించనున్నారు. నిందితులు పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడంతో సిట్ దానిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితుల చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి పంపించారు. రాంచంద్రభారతి నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని బంజారాహిల్స్ పీఎస్ లో మరో కేసు నమోదైంది. వీటిపైనా సిట్ అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది.

అసలేం జరిగిందంటే..తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 9, 2022, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details