నిన్నటి వరకు ఐఏఎస్ హోదాలో బిజీగా గడిపిన ఆ అధికారి ఇప్పుడు వరి నూర్పిడి పనుల్లో పాల్గొని సాగుపై తనకున్న మమకారం చాటుకున్నారు. ఏపీ రాష్ట్ర పునరావాస కమిషనర్గా పనిచేసిన తమర్భ బాబురావు నాయుడి స్వగ్రామం విశాఖ జిల్లా పాడేరు మండలం డోకులూరు.
నిన్నటి వరకు ఐఏఎస్... నేటి నుంచి కర్షకుడు - T babu rao naidu IAS news
ఐఏఎస్ అధికారిగా పలు పదవులు అలంకరించిన ఆయన... ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. పదవీ విరమణ అనంతరం... స్వగ్రామానికి చేరుకుని పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

నిన్నటి వరకు ఐఏఎస్... నేటి నుంచి కర్షకుడు
ఏపీలోని ఆదివాసీలలో తొలి ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన... పలు పదవులు చేపట్టారు. కడప జిల్లా కలెక్టర్గా, విశాఖపట్నం ఉడా ఛైర్మన్గా సేవలందించారు. 2020 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే స్వగ్రామానికి చేరుకుని పొలం పనుల్లో నిమగ్నమయ్యారు
ఇదీ చదవండి:ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదు: కోదండరాం