హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎంబీటీ నగర్లో పెద్దప్రమాదం తప్పింది. యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కూలిన పాఠశాల ప్రహారీ...తప్పిన పెనుప్రమాదం - బంజారాహిల్స్‌లో కూలిన గోడ
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పెనుప్రమాదం తప్పింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన గోడ కూలిపోయింది. ఈ ఘటనతో అక్కడ స్థానికులు భయందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
కూలిన పాఠశాల ప్రహారీ...తప్పిన పెనుప్రమాదం
గత కొన్ని రోజులుగా గోడకు భారీ పగుళ్లు వచ్చినా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోడ కూలి రోడ్డుపై పడడంతో ఆ మార్గంలో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థతిని చక్కదిద్దారు. నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆర్టీసీ బస్సు కదలదు... రైలు బండిలో ఖాళీ లేదు...
TAGGED:
ప్రైవేట్ పాఠశాల