తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​ తమిళిసైకి 100 అత్యాధునిక వెంటిలేటర్లు అందజేత - governor tamilisai soundararajan latest news

పుణెకు చెందిన ఓ సంస్థ తన దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా చికిత్సకు అవసరమవుతోన్న వెంటిలేటర్లను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు 100 అత్యాధునిక వెంటిలేటర్లను ఆ సంస్థ ప్రతినిధులు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు అందజేశారు.

గవర్నర్​ తమిళిసైకి 100 అత్యాధునిక వెంటిలేటర్లు అందజేత
గవర్నర్​ తమిళిసైకి 100 అత్యాధునిక వెంటిలేటర్లు అందజేత

By

Published : Jun 26, 2021, 8:11 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పలు సంస్థలు తమకు చేతనైన సాయం అందిస్తున్నాయి. విపత్తు వేళ ప్రజలకు వెన్నంటి ఉంటూ.. అనేక వైద్య పరికరాలను అందజేస్తున్నాయి. ఈ క్రమంలోనే పుణెకు చెందిన హైటెక్ ప్రిసీసన్ ఇంజినీరింగ్, మెడికల్ డివైస్ సంస్థ (ఏజీఐఎమ్​ఈడీ) ఆధ్వర్యంలో 100 అత్యాధునిక వెంటిలేటర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు అందించారు.

కొవిడ్ రిలీఫ్ పరికరాలను అందించి ప్రభుత్వానికి చేయూత అందించడం సంతోషకరమని ఆ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను గవర్నర్​ అభినందించారు.

ఇదీ చూడండి: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం

ABOUT THE AUTHOR

...view details