హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు స్థానిక కాలనీవాసులు ప్రశంస పత్రం అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని షౌకత్‌నగర్ బస్తీ వాసులు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో హౌస్ ఆఫీసర్ పి శివచంద్ర స్పందించి వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించడంతో బస్తీవాసులు ఆ ఎస్సైని ప్రశంసించారు.
బస్తీవాసుల ప్రశంస పొందిన పోలీసు - హైదరాబాద్ తాజా వార్తలు
సాధారణంగా పోలీసులకు పై అధికారుల నుంచి ప్రశంస పత్రాలు వస్తాయి. కానీ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు షౌకత్‌నగర్ బస్తీ వాసుల నుంచి ప్రశంస పత్రం వచ్చింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2, 3లో ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో లౌడ్ స్పీకర్లతో పెద్దగా శబ్దాలు రావడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని షౌకత్‌నగర్ బస్తీ వాసులు వారం రోజుల కిందట బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లౌడ్ స్పీకర్ శబ్దాలతో పిల్లల చదువులతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా అసౌకర్యంగా మారిందని ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్సై... స్థానికులు, ఆలయ నిర్వాహకులతో మాట్లాడి సమస్యను ఎవరికి ఇబ్బంది కలుగకుండా పరిష్కరించారు. సమస్యకు సామరస్యంగా పరిష్కరించినందుకు షౌకత్ నగర్ బస్తీ ప్రజలు... ఎస్సై శివచంద్రను ప్రశంసించారు.
ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'