తెలంగాణ

telangana

ETV Bharat / state

'17న రాష్ట్రమంతటా మొక్కలు నాటే కార్యక్రమం'

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. ముఖ్యమంత్రి​ పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట్రమంతటా పెద్దఎత్తున మొక్కలు నాటనున్నట్లు చెప్పారు.

Minister Talasani
Minister Talasani

By

Published : Feb 15, 2020, 11:36 PM IST

పర్యావరణ పరిరక్షణకు, భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని పశువైద్యశాలలు, డెయిరీలు, మత్య్సశాఖ కార్యాలయాలు, వెటర్నరీ విశ్వవిద్యాలయాల ఆవరణల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి :ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సింగిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details