ఓ వ్యక్తికి పగవాడికి కూడా రాని కష్టం వచ్చింది. తనకు కలిగిన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియని పరిస్థితి. విపత్కాలంలో నేనున్నానంటూ కనిపించే మంత్రి కేటీఆర్(KTR) గుర్తొచ్చారు. ఇంకేముంది తనకు కలిగిన ఇబ్బందిని గురించి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్(Tweet) చేశాడు. ఇంతకీ అతనికొచ్చిన ఇబ్బందేమిటంటే..
KTR: కేటీఆర్ సార్... నా బిర్యానీలో లెగ్‌పీస్ రాలేదు
ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి... తనకొచ్చిన పార్శిల్లో లెగ్‌పీసులు (leg piece) లేవంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి స్పందించారు.
తోటకూరి రఘుపతి అనే వ్యక్తి ఆన్లైన్లో బిర్యాని ఆర్డర్ చేశాడు. చికెన్ బిర్యాని విత్ఎక్స్ట్రా మసాలాతో(Biryani with extra masala) పాటు లెగ్ పీసులను ఆర్డర్ చేశాడు. అయితే తనకొచ్చిన పార్శిల్లో ఇవేమీ కనిపించలేదు. అసలే ఆకలితో ఉన్నాడేమో కడుపు మండిపోయింది. ఎక్స్ట్రా మసాలా ఆర్డర్ ఇస్తే ఒట్టి బిర్యానీ ఇచ్చి పోతారా అని కుతకుతలాడిపోయాడు. ఏమి చేయాలో తెలియక ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రజలకు ఇలాంటి సేవలు అందించడం ఏంటని ఉక్రోసాన్ని వెళ్లగక్కాడు.
అతడి ట్వీట్‌పై స్పందించిన మంత్రి ఈ విషయంలో నేనేమి చేయగలను బ్రదర్... నా నుంచి నీవు ఏం ఆశిస్తున్నావని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ తర్వాత... ఆ వ్యక్తి తాను చేసిన ట్వీట్‌ను తొలగించాడు.