Paritala Sunitha: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ ఓ వ్యక్తి.. మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్ల మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు.. తనని మన్నించాలంటూ ఆమె కాళ్లు పట్టుకున్నారు. మారూరు గ్రామంలో నిర్వహిస్తున్న "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" కార్యాక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తర్వాత అతన్ని పైకి లేపిన సునీత జరిగిందేదో జరిగింది అని టీడీపీ కండువా కప్పి.. ఆహ్వానించారు.
తప్పు చేశానంటూ పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న వ్యక్తి.. ఎక్కడంటే? - This is the program for Karma State
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత నిర్వహించిన "ఇదేం కర్మ రాష్ట్రానికి" కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి తప్పు చేశానని ఓ వ్యక్తి సునీత కాళ్ల మీద పడి క్షమాపణ అడిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగింది.
![తప్పు చేశానంటూ పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న వ్యక్తి.. ఎక్కడంటే? The Ramanjaneys held Paritala Sunita's legs saying that she had done something wrong](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17321478-810-17321478-1672123944938.jpg)
తప్పు చేశానంటూ పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న రామాంజనేయులు
రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కబ్జాలు, మట్టి, ఇసుక మాఫియా తప్ప అభివృద్ధి చేయలేదని సునీత మండిపడ్డారు. మూడేళ్లలో అనేక మంది రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న.. యువతకు ఉపాధి రావాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
తప్పు చేశానంటూ పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న రామాంజనేయులు
ఇవీ చదవండి: