తెలంగాణ

telangana

ETV Bharat / state

'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు' - క్వారంటైన్​ అంటే ఏమిటి

క్వారంటైన్​ సెల్​... ప్రస్తుతం మనం వింటున్న పేర్లలో ఇదీ ఒక్కటి. కరోనా అనుమానితులను ఈ సెల్​లో ఉంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ వారు ఎలా ఉంటారు? వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారనే అనుమానాలు అందరికీ ఉంటాయి. మీ సందేహాలు తీరాలంటే ఈ వీడియో చూడండి.

quarantine rooms latest news
quarantine rooms latest news

By

Published : Mar 17, 2020, 7:53 PM IST

Updated : Mar 17, 2020, 8:12 PM IST

కరోనా ప్రబలుతున్న వేళ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కరోనా అనుమానితులను క్వారంటైన్​ సెల్​లో ఉంచుతున్నారు. క్వారంటైన్​ అంటే.. వారిని నిర్బంధిస్తున్నారా అనే అనుమానం రావొచ్చు. జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తి క్వారంటైన్​ సెల్​లో ఉంటూ అక్కడి పరిస్థితిని వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ వీడియో చూస్తే క్వారంటైన్​ సెల్​పై మీకు ఉండే సందేహాలు తొలగిపోతాయి.

క్వారంటైన్​ సెల్​లో వారిని చాలా బాగా చూసుకుంటున్నారని.. ఒక్కొక్కరికీ ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారని ఆ వీడియోలో తెలిపారు. వారికి పెట్టే భోజనం ఎంతో బాగుటుందన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, డాక్టర్లు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని.. ఇలాంటి సౌకర్యాలు జర్మనీలోనూ చూడలేదని ఆ వ్యక్తి మెచ్చుకున్నాడు. తమని ఇంతబాగా చూసుకుంటున్నందుకు.. ప్రధాని, ఆరోగ్యమంత్రి, పోలీసులు, డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.

'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు'

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...

Last Updated : Mar 17, 2020, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details