టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎస్సార్‌నగర్‌కు చెందిన సుమన్... హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. భూ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
'సెటిల్మెంట్ చేసుకోకపోతే.. చంపేస్తానన్నారు' - సీపీ అంజనీ కుమార్
తన భూ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని ఎస్సార్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి... టాస్క్‌ఫోర్స్ పోలీసులపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశాడు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై సీపీకి ఫిర్యాదు
టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తనను బలవంతంగా అదుపులోకి తీసుకుని సెటిల్మెంట్ చేసుకోవాలని భయపెట్టారని సుమన్ ఆరోపించాడు. అలా చేయని పక్షంలో తనపై అక్రమ కేసులు పెడతానంటూ బెదిరించారని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని సీపీ అంజనీ కుమార్‌ను కోరాడు.
- ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?