హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ... కోర్టు ఆవరణలో లాయర్లు రెండో రోజు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో ఓ న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తోటి న్యాయవాదులు ఆ వ్యక్తిని చితకబాదారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని అతడిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
న్యాయవాదుల నిరసనలో ఉద్రిక్తత.. లాయర్‌పై వ్యక్తి దాడి - a person attack on lawyer at nampally court
నాంపల్లి కోర్టు వద్ద స్పల్ప ఘర్షణ చోటుచోసుకుంది. న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ లాయర్లు రెండో రోజు నిరసన చేపట్టారు. ఆందోళనలో ఓ న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.
నాంపల్లి కోర్టు, న్యాయవాదుల హత్య కేసు
ఆ న్యాయవాది తమ బంధువేనని... కొట్టిన వ్యక్తి కుటుంబ సభ్యులు వెల్లడించారు. బంధువైనప్పటికీ కోర్టు ఆవరణలో దాడి చేయడంపై లాయర్లు మండిపడ్డారు.
ఇదీ చదవండి:పార్లమెంట్ భవనం రెడ్‌స్టోన్‌ను పరిశీలించిన ప్రశాంత్‌రెడ్డి