తెలంగాణ

telangana

ETV Bharat / state

కిమ్స్ టు అపోలో... గ్రీన్‌ ఛానెల్ ద్వారా పేషంట్ తరలింపు - గ్రీన్ ఛానెల్

గ్రీన్‌ ఛానెల్ ద్వారా నగరంలో ఒకరి ప్రాణాలు కాపాడారు హైదరాబాద్ పోలీసులు. మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా సికింద్రాబాద్ కిమ్స్‌ నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ నిలిపేసి పేషంట్‌ను సకాలంలో గమ్యస్థానానికి చేర్చారు.

patient moved through green channel
సికింద్రాబాద్ కిమ్స్‌ నుంచి బంజారాహిల్స్‌లోని ఆస్పత్రికి రోగి తరలింపు

By

Published : May 6, 2021, 9:24 PM IST

ఆపద సమయంలో నగర పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం గ్రీన్‌ ఛానెల్ ద్వారా ఒకరి ప్రాణాలు కాపాడారు. సికింద్రాబాద్ కిమ్స్‌ నుంచి బంజారాహిల్స్‌లోని ఆస్పత్రికి ఓ రోగిని తరలించారు. ట్రాఫిక్ నిలిపేసి 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 9 నిమిషాల్లో చేర్చారు.

సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవడంతో మెరుగైన వైద్యం అందేలా కృషి చేశారు. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న వ్యక్తిని అపోలోకు తరలించారు. అతనికి ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు అపోలో ఆస్పత్రికి ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ద్వారా తీసుకెళ్లారు.

ఇదీ చూడండి :'కరోనావ్యాప్తిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details