బ్లూటూత్ స్పీకర్లో బంగారం తరలిస్తుండగా పట్టివేత - shamshabad airport in hyderabad
బంగారానికి వెండి పూత చేయించి బ్లూటూత్ స్పీకర్లో దాచి తీసుకువస్తోన్న ప్రయాణికుడి నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు విలువచేసే పసిడిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
a passenger from abu dhabi hid gold in bluetooth speaker and caught by customs officers in shamshabad airport in hyderabad
బ్లూటూత్ స్పీకర్లో బంగారం తరలింపు
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ బంగారం తీసుకొచ్చిన ఓ ప్రయాణికుణ్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుదబి నుంచి వచ్చిన అతను బంగారానికి సిల్వర్ కోటింగ్ చేయించి జ్యూస్ మిషన్, బ్లూటూత్ స్పీకర్, వాచ్ డయల్లో దాచి తీసుకుళ్లేందుకు ప్రయత్నించాడు. అది గుర్తించిన కస్టమ్స్ అధికారులు 574.70 గ్రాముల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
- ఇదీ చూడండి : శంకరమ్మ ... ఇచ్చింది మరోజన్మ