అమరావతి కోసం సామాన్యుడి అసామాన్య పోరాటం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లగుంటకు చెందిన గంటా వెంకట నరసింహరావు అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ సామాజిక ఉద్యమాన్ని చేస్తున్నారు. మాజీ సర్పంచ్ అయిన ఈయన... ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఈనాడు కథనాలను లామినేషన్ చేయించి గ్రామంలోని యువతకు వీటిని వివరిస్తున్నారు. వారి ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వీలైనంత వరకూ ఎక్కువ మందికి అమరావతి వాస్తవ పరిస్థితి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు.
ఆందోళనల్లోనూ భాగస్వామ్యం
గంటా నరసింహరావు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీ కార్యాలయం కోసం తన స్థలాన్ని దానంగా ఇచ్చారు. ఉచితంగా శుద్ధజల ప్లాంటును నడుపుతున్నారు. అమరావతి రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని నమ్మిన ఈ పెద్దాయన.... అనేక సార్లు రాజధాని రైతుల ఆందోళనల్లోనూ పాల్గొన్నారు. అమరావతి ఉద్యమానికి తనవంతు పాత్ర పోషించినట్లు ఉంటుదన్న ఉద్దేశంతో ఈ కథనాలు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నట్లు తెలిపారు. గంటా వెంకట నరసింహరావు అమరావతిలో రాజధాని కొనసాగించాలంటూ.. చేస్తోన్న ఉద్యమం గ్రామంలో యువతను ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి:
వివాహ వేడుక... అమరావతి నినాదానికి వేదిక