సాహసానికి వయసుతో పనిలేదని నిరూపించాడు ఓ వృద్ధుడు. ఏడు పదుల వయసులో అరుదైన ఫీట్ సాధించాడు. ఆయన సాహసానికి మెచ్చి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో(Wonder Book of World Records) స్థానం కల్పించారు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన డా.కృష్ణ ఎదుల ఈ సాహసోపేతమైన ప్రదర్శన చేశారు.
సాహమేంటంటే...
స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా.. నేల్ బోర్డుపై పడుకొని 159 షాబాద్ బండరాళ్లను తన ఛాతిపై పగులగొట్టుకుని అబ్బురపరిచాడు. ఓ పాఠశాలలో జరిగిన ఈ ప్రదర్శనను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ముందు డా.కృష్ణ ఎదుల(Dr. Krishna Edula created wonder book of world record) ప్రదర్శించారు. 70 ఏళ్ల వయసులో ఏడు నిమిషాల్లో ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటిసారి అన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్తో ఉండటానికి... ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన ఫీట్ సాధించిన డా.కృష్ణ ఎదులకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్( world record feet in seven minutes), ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , విశ్వం వరల్డ్ రికార్డ్స్, డైమండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మెడల్స్‌తో ఘనంగా సత్కరించారు.