Telangana Council new protem chairman : రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి పదవీకాలం మంగళవారం ముగిసింది. కొత్త ప్రొటెం ఛైర్మన్ నియామకం బుధవారం జరగనుంది. మండలిలో సీనియర్ సభ్యులైన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్, వీజీ గౌడ్‌లలో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశముంది. రాజేశ్వర్‌రావు గవర్నర్ కోటాలో 2007 నుంచి, వీజీ గౌడ్ శాసనసభ్యుల కోటాలో 2011 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. కొత్త ప్రొటెం ఛైర్మన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని గవర్నర్‌కు సిఫార్సు చేసే వీలుంది.
భూపాల్‌రెడ్డికి వీడ్కోలు పలుకుతూ పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, విప్ ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, మహిళా ఆర్థిక సంస్థ ఛైర్మన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు చిన్నపరెడ్డి, సుధాకర్‌రెడ్డి