కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. కాదేదీ ఆనర్హం ప్రేమను వ్యక్తం చేసేందుకు అంటున్నారు ఆధునిక ప్రేమికులు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ అల్వాల్‌కు చెందిన సూక్ష్మకళాకారుడు ప్రదీప్.. రావి ఆకుపై ప్రేమ జంటకు ఇలా రూపమిచ్చారు.
ఆకులో జంట... అణువణువు అందమేనంట.. - ప్రేమికుల రోజు బహుమతులు
విశ్వవ్యాప్తమైన ప్రేమకు.. అణువణువు ఆభరణాలే.. మనసున ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఖరీదైన బహుమతులే కాదు.. ఓ చిన్న ఆకుతో కూడా ప్రేమ సందేశం పంపొచ్చని చేసి చూపించాడో కళాప్రేమికుడు. రావి ఆకుపై ప్రేమ జంటకు రూపమిచ్చి ప్రేమికులరోజు శుభాకాంక్షలు వినూత్నంగా తెలిపాడు.
ఆకులో జంట... అణువణువు అందమేనంట..
విశ్వమంత పరిధి ఉన్న ప్రేమ బంధాన్ని ఓ చిన్న ఆకులో అందంగా ఆవిష్కరించాడు. ప్రేమికుల రోజు సందర్భంగా తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు.
ఇదీ చూడండి:ఏది ప్రేమ..! ప్రేమంటే తెలుసా మీకు..?