తెలంగాణ

telangana

ETV Bharat / state

చైనా మాంజా తగిలి వ్యక్తి ముఖంపై గాయాలు - a man was injured by China Manza in old city

చైనా మాంజా వల్ల ఓ వ్యక్తి ముఖంపై గాయాలైన సంఘటన హైదరాబాద్​ పాతబస్తీ కాలపత్తర్​ ప్రాంతంలో చోటు చేసుకుంది. తనను ఆస్పత్రికి తీసుకెళ్లిన కాలపత్తర్​ పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

a man was injured by China Manza in old city Hyderabad
హైదరాబాద్​ పాతబస్తీలో చైనా మాంజా వల్ల వ్యక్తికి గాయాలు

By

Published : Sep 7, 2020, 4:04 PM IST

హైదరాబాద్​ పాతబస్తీ కాలపత్తర్​కు చెందిన ఎండీ. యూసుఫ్​ తన కూతురుతో కలిసి పాలు తీసుకురావడానికి జనరల్​ స్టోర్​కు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో రహదారిపై చైనా మాంజా తగిలి యూసుఫ్ ముఖానికి గాయాలయ్యాయి.

అక్కడే ఉన్న కాలపత్తర్ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి తనను ఆస్పత్రికి తీసుకెళ్లి, తన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసిన కాలపత్తర్ పోలీసులకు యూసుఫ్ కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details