హైదరాబాద్ పాతబస్తీలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఉదయం నుంచే బారులు తీరారు. దాదాపు 44 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. లాక్డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా ఇంట్లో భార్యలతో విరక్తి చెందామని ఓ కొనుగోలుదారుడు తెలిపాడు. మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాడు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదం చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం - lock down in telangana
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓ మద్యం కొనుగోలుదారుడు కృతజ్ఞతలు తెలిపాడు. మద్యం దుకాణాలు తెరిచినందుకు ఆనందంగా ఉందన్నాడు.
సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం