ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని యూసఫ్‌గూడ ఎల్ఎన్ నగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఏపీలోని కడపజిల్లా పొద్దుటూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని యూసఫ్‌గూడ ఎల్ఎన్ నగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఏపీలోని కడపజిల్లా పొద్దుటూరుకు చెందిన నాగేంద్రబాబుగా గుర్తించారు. మద్యానికి బానిస కావడమే కాకుండా, ఆన్లైన్లో బెట్టింగులు ఆడేవాడని మృతుడి భార్య తెలిపింది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.