ఒడిశాలోని బాలసోర్కు చెందిన చందన్ గోహరే(28) పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ చివరి బస్టాప్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక కాపాడాలని బిగ్గరగా కేకలు వేయగా స్థానికులు గమనించి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య - a man suicide in hyderabad
బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చిన వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య