కొడుకునిచ్చి పెళ్లి చేయవలసిన యువతిపైనే ఒక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన దిగ్ర్భాంతికర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నిత్యానందం అనే వ్యక్తి వేదారణ్యంలో బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఆయన కుమారుడు ఎన్.ముకేశ్ కన్నన్, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇది నచ్చని నిత్యానందం వారిని ఎలాగైనా విడదీయాలని నిర్ణయించుకున్నాడు.
మాట్లాడదామని రమ్మన్నాడు
వివాహం గురించి మాట్లాడటానికి కొడుకు ప్రేమించిన యువతిని పిలిపించాడు. ఆమె ఇంటికి రాగానే ఫోన్ లాక్కున్నాడు. ఆ వెంటనే మంగళసూత్రాన్ని ఆమె మెడలో కట్టాడు. అక్కడితో ఆగని ఆ దుర్మార్గుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండురోజుల పాటు తన ఇంట్లోనే నిర్బంధించి లైంగిక దాడి చేశాడు. ఆపై ఆమెను తన స్నేహితుడి ఇంట్లో దాచాడు.
విషయం తెలుసుకున్న కన్నన్..తన ప్రియురాలిని రక్షించాడు. తన తండ్రి చేసిన ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగపట్టిణం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి