హైదరాబాద్ గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలోని మోతీ దర్వాజా వద్ద దారుణం జరిగింది. స్థానికంగా ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య సమీరబేగంను గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే దీనికి కారణమని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
మోతీ దర్వాజాలో భార్య గొంతు కోసిన భర్త - మోతీ దర్వాజలో దారుణం
కుటుంబ కలహాలు ఆ వివాహిత ప్రాణం తీశాయి. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని మోతీ దర్వాజా వద్ద ఓ భర్త తన భార్యను దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య హత్య