పింఛన్ డబ్బు ఇవ్వలేదని కన్న తండ్రినే దారుణంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లా చందర్లపాడులో ఈనెల 8న దారుణం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ మహబూబ్‌సాహెబ్ (75) రోజువారీ కూలి. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. ఈనెల 8వ తేదీన 2,250 రూపాయల వృద్ధాప్య పింఛన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రి అతని రెండో కొడుకు సిలార్‌సాహెబ్ ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తండ్రిని డబ్బు అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో దాడికి దిగాడు. గొంతు నులిమి చంపేదుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన మహబూబ్ సాహెబ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి నందిగామ ఆస్పత్రిలో అతను మరణించాడు.
పింఛన్ సొమ్ము కోసం కన్నతండ్రినే చంపేశాడు - son
మానవత్వం మంట కలిసిన క్షణమిది! పింఛన్ కోసం ఓ కసాయి కొడుకు లిఖించిన రక్త చరిత్ర ఇది! కేవలం రూ. 2,250 రూపాయల కోసం కన్న తండ్రినే కొట్టి చంపిన విషాదమిది!?
పింఛన్ కోసం కన్నతండ్రినే చంపేశాడు