తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తుండగా వ్యక్తి అదృశ్యం - man missing
తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వస్తున్న సమయంలో కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తుండగా వ్యక్తి అదృశ్యం
తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తిరుపతి నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన అశోక్ ... రాత్రి ఒంగోలు వచ్చే వరకు ఉన్నాడని తరవాత కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
man missing