ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఏటికొప్పాకకు చెందిన... జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ హస్త కళాకారుడు శ్రీశైలపు చెన్నయ్యచారి... అరుదైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. తలవెంట్రుక మొనపై.. బంగారంతో తాజ్‌మహల్‌ను తయారుచేసి రికార్డు సాధించారు. సూక్ష్మ కళాఖండాల రూపకల్పనలో దిట్ట అయిన చెన్నయ్యచారి... ఈ అతి సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించారు.
Golden Taj mahal: తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్ - Fine arts news
తలవెంట్రుక మెునపై బంగారంతో తాజ్‌మహల్ రూపొందించి అబ్బురపరిచారు.. ఏపీలోని ఏటికొప్పాకకు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు శ్రీశైలపు చెన్నయ్యచారి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలన్న ఆశయంతో.. ఈ అద్భుత కళాకృతిని సృష్టించినట్లు ఆయన తెలిపారు.
![Golden Taj mahal: తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్ a-man-made-the-taj-mahal-with-gold-on-his-hair-in-visakhapatnam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11987766-666-11987766-1622623637378.jpg)
Golden Taj mahal: తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్
Golden Taj mahal: తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్
ఈ తాజ్ మహల్ పొడవు 0.1 మిల్లీమీటర్లు కాగా.. వెడల్పు 0.15 మిల్లీ మీటర్లు. సూక్ష్మదర్శినితో తప్ప మామూలుగా చూడలేని అతి చిన్న తాజ్‌మహల్‌ను.. ఐదురోజుల పాటు శ్రమించి తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతి చిన్న తాజ్‌మహల్‌గా ఇది గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు..