మెహదీపట్నం అసిఫ్ నగర్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. కిషన్నగర్లో మహబూబ్, తయ్యబ్ స్థానికంగా నివాసముంటున్నారు. ఆస్తి తగాదాలతో సోదరుల మధ్య తరచూ వివాదాలు జరిగేవి. నిన్నరాత్రి తాగిన మైకంలో వీరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన మహబూబ్ తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు తయ్యబ్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న - murder at asifanagar
ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతో తమ్ముడినే హత్యచేశాడు ఓ అన్న. మోహదీపట్నంలోని అసిఫ్నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న